

చీరాల కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపం నందు చీరాల తెలుగుదేశం పార్టీ నూతన పట్టణ కమిటీ ప్రమాణస్వీకారం చేయించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకొని బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ చీరాల పట్టణ అధ్యక్షులుగా దోగుపర్తి వెంకట సురేష్ గారిని నియమించారు, పట్టణ అధ్యక్షులు మరియు వారి కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో ఉండాలని తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్ గారు ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత గారు చీరాల తెలుగుదేశం పార్టీ లో ఉన్న వివిధ హోదాలో ఉన్న నాయకులు కూటమి నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు







