చీరాల, నవంబర్ 2:-చీరాల ఓడరేవు వద్ద నవంబర్ 5వ తేదీ బుధవారం జరగనున్న పౌర్ణమి సాగర హారతికు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాగర హారతి కమిటీ సభ్యులు డాక్టర్ తాడివలస దేవరాజు, మున్నెం శ్రీనివాస్ రెడ్డి, దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఓంకేశ్వర్ నుండి నర్మదా మరకత భాను లింగాన్ని తీసుకువచ్చారు.ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సహకరించిన టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్ నాథ్కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ,
“సాగర హారతి మరకత శివలింగానికి 3వ మరియు 4వ జ్యోతిర్లింగాలైన మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం ఆలయాల్లో పూజలు నిర్వహించాం. ఓంకారేశ్వర్ నుండి తెచ్చిన నర్మదా మరకత భాను లింగానికి చీరాల కొత్తపేట ఓంకారేశ్వర దేవాలయంలో పంచామృతాభిషేకం, పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు కారంచేటి నగేష్, కార్తిక శర్మల ఆధ్వర్యంలో నిర్వహించాం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు, సాగర హారతి కమిటీ సభ్యులు డాక్టర్ శబరి గుప్తా, బుర్ల సాంబశివరావు, బాంబే సురేష్, ఏల్చూరి మురళి, కొప్పవరపు మల్లికార్జున్ రావు, ఉలిచి సతీష్, ఓంకార క్షేత్ర కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ శర్మ, జాలాది శ్రీనివాస్, పలువాది రవితేజ, భజన బృంద సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.