
చీరాల: డిసెంబర్ 22:-చీరాల పట్టణంలో సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక NR & PM హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గానికి చెందిన సుమారు 3000 మంది పేద ప్రజలకు చీరల పంపిణీ జరిగింది.

ఈ కార్యక్రమానికి చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగలు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా చీరాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆమంచి కృష్ణమోహన్ గారు, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.Chirala Local News
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే ఆమంచి కృష్ణమోహన్ గారి సేవాభావాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.










