

ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాలలో ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండయ్య గారు ప్రజల వద్ద నుండి స్వయంగా సమస్యల వినతుల అర్జీలను స్వీకరించారు. మొత్తం 261 పైగా అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాల కోసం & ఇంటి స్థలాల కోసం 220, 29 పింఛన్లు , 12 పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతువరపు జనార్ధన్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు , కౌన్సిలర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు








