మంగళగిరి, అక్టోబర్ 14:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంగళవారం మంగళగిరిలో జరిగిన స్టేట్ వెట్‌ల్యాండ్ అథారిటీ సమావేశంలో రాష్ట్రంలోని చిత్తడి నేలల పరిరక్షణకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భద్రతకు, భూగర్భజలాల పెంపుకు, పర్యాటక అభివృద్ధికి ఎంతో అవసరం” అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 చిత్తడి నేలలను గుర్తించామని, ఈ గుర్తింపు దక్షిణ భారతదేశంలో ఒకేసారి ఈ స్థాయిలో జరిగిన తొలి చర్యగా నిలిచిందని చెప్పారు.
సోంపేటలో టూరిజం కారిడార్‌సోంపేట, తవిటి మండలాల పరిధిలోని మూడు ప్రధాన చిత్తడి నేలలను కలిపి ప్రత్యేక పర్యాటక కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. “2018లో సోంపేట చిత్తడి నేలలను పరిశీలించాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రక్షిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం” అని చెప్పారు.పక్షి సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలువీరాపురం (అనంతపురం జిల్లా) మరియు పుణ్యక్షేత్రం (రాజమండ్రి సమీపం) ప్రాంతాల్లో అరుదైన పక్షుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కేంద్రాలు పక్షి ప్రేమికులకు కొత్త ఆకర్షణగా నిలవనున్నాయి.చిత్తడి నేలల మ్యాపింగ్ పురోగతిరాష్ట్రంలో 23,450 చిత్తడి నేలలు ఉన్నట్లు గుర్తించగా, వాటిలో 99.3 శాతం డిజిటల్ సరిహద్దుల మ్యాపింగ్ పూర్తయింది. భౌతిక సరిహద్దుల గుర్తింపు ఈ నెల 28లోపు పూర్తిచేయాలని సంబంధిత శాఖలకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో అటవీ శాఖ, రెవెన్యూ మరియు సర్వే విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.కొల్లేరు సరస్సుకు ప్రత్యేక మేనేజ్మెంట్ అథారిటీఇప్పటికే రాంసర్ గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు పరిరక్షణకు ప్రత్యేకంగా ‘కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వెల్లడించారు. అదే తరహాలో మరిన్ని చిత్తడి నేలలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.సమావేశంలో పాల్గొన్నవారుఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఏపీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్. శరవణన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా రాష్ట్ర ప్రతినిధి ఫరిదా థంపాల్, శాస్త్రవేత్తలు రామ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ గోల్డిన్ ఖుద్రోస్ తదితరులు హాజరయ్యారు.