
హైదరాబాదు:30-11-25:- క్రిస్మస్ సీజన్‌కు నగరం రంగులద్దుకుంటోంది. ముందస్తు వేడుకల సందడి భాగంగా ప్రముఖ కోరల్ బృందం ద ఫెస్టివల్ కొయర్‌స్టర్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా ఆదివారం అద్భుతమైన గ్రాండ్ కాన్సర్ట్ నిర్వహించారు. “వాట్ ఎ డే ఆఫ్ జాయ్” పేరుతో జరిగిన ఈ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
కోరల్ స్వరాల హార్మోనీతో హాల్ మార్మోగగా… తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి, ఐపీఎஸ் అధికారి అరుణ బహుగుణ స్వయంగా స్టేజ్ పైకి వచ్చి పాటలు పాడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో పాటు పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై గాయనీ–గాయకులను అభినందించారు.క్లాసికల్, సెమీ క్లాసికల్, ఆధునిక క్రిస్మస్ సంగీతం, సంప్రదాయ కీర్తనల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలో కొత్త సంగీత అలంకరణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హృదయాన్ని హత్తుకునే హార్మోనీస్, భావోద్వేగాలను రగిలించే స్వర విన్యాసం కొయర్‌స్టర్స్ ప్రత్యేకతగా నిలిచింది.క్రిస్మస్ సందేశమైన ఆనందం, శాంతి ను సంగీతం ద్వారా అందరికీ పంచడమే మా లక్ష్యమని కార్యక్రమ నిర్వాహకులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ తెలిపారు.







