chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Parchuru Local News :సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు హేయం-బేషరతుగా క్షమాపణ చెప్పాలి-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జనవరి 31 :-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో అంబటి వ్యాఖ్యలు రాజకీయ విలువలకు విరుద్ధమని విమర్శించారు.

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఏలూరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

గతంలో నోరు పారేసుకున్న ధోరణి కారణంగానే వైసీపీకి ప్రజలు ఘోర పరాజయం చూపించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అయినా అంబటి రాంబాబుకు ఇప్పటికీ సిగ్గు, పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.

వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని రాజకీయాల్లోకి తీసుకువస్తోందని ఆరోపించిన ఆయన, గొడవలు, హింసాత్మక ధోరణులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.Bapatla Local News

అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని కోరారు. ఇకనైనా నోరును అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker