
గుంటూరు, ఫిబ్రవరి 12:-శ్రీ మెధా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు CMA ఫైనల్ మరియు ఇంటర్ పరీక్షల ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. 2026 ఫిబ్రవరిలో నిర్వహించిన ICMAI (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) CMA పరీక్షల్లో సంస్థ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు.

CMA ఫైనల్ విభాగంలో ఎస్. కార్తిక్ ఆల్ ఇండియా 21వ ర్యాంక్ సాధించి విశేష ప్రతిభ చూపారు. ఆయన సాధించిన విజయంతో విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఇక CMA ఇంటర్ విభాగంలో కూడా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎస్. కార్తిక్ (SRL No: 346665) 800 మార్కులకు గాను 506 మార్కులు సాధించగా, జి. చరణ్ 457 మార్కులు, నవీన్ 456 మార్కులు, ఎస్.కె. సాయి 449 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. జూనియర్ ఇంటర్ MEC నుంచి CMA వైపు అడుగులు వేసిన విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల క్రమశిక్షణ, నిబద్ధతతో కూడిన శిక్షణా విధానమే ఈ విజయాలకు కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా CMA, CA వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పారు.Guntur Local News
అలాగే CMA ఇంటర్ విద్యార్థులకు ICMAI ఫీజు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉండగా, ఇంటర్న్షిప్ ఫీజుల్లో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు.










