

*బాపట్ల పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 25 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ :-
ఇది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీయం సహాయ నిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగానిలుస్తుందని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని,అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీయం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.











