గుంటూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లోచర్ల రమేష్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APUWJ) గుంటూరు జిల్లా, నగర కమిటీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, “జిల్లా సమాచార శాఖలో పారదర్శకత, ప్రజా సమాచారాన్ని సమయానుకూలంగా అందించడంలో రమేష్ గారి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. జర్నలిస్టుల సహకారం ఎల్లప్పుడూ ఆయనకు ఉంటుందని” పేర్కొన్నారు.
లోచర్ల రమేష్ గారు జర్నలిస్టుల ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సంబంధాల విభాగం ద్వారా ప్రజలకు చేరువైన సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.ఎన్ మీరా, కె రాంబాబు, నగర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకయ్య, కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు రాజా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు పరస్యం నాయక్, నగర ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వరరావు , ఏ వీరభద్ర రావు, కోశాధికారి షేక్ సుభాని, సహాయ కార్యదర్శులు కే సుజి బాబు , జి.అప్పారావు, సభ్యులు రఘునాథరెడ్డి, పవన్ నాయుడు,వెన్నపూస దశరథ రామిరెడ్డి , దేవానంద్, కోటి, నాగ , మణి తదితరులు పాల్గొన్నారు.