తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఆకుల లక్ష్మీలావణ్య ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు గాను 345 మార్కులు (69%) సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు.
గత నెల ఆగస్టు 11న బొమ్మూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీలావణ్యను కలిసినప్పుడు ఆమె “మీ ఇంటికి వస్తా” అని చెప్పిన మాట ప్రకారం, మండల పర్యటనలో భాగంగా లక్ష్మీలావణ్య అదే గ్రామంలో ఉండడంతో ఆమె ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను కలిసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, అందుకు లక్ష్మీలావణ్య నిదర్శనమని” అన్నారు