ఏలూరు కలెక్టరేట్ లో ఏలూరు జిల్లా కలెక్టర్ గా వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరం లోకి అడుగిడుతున్న సంధర్భంగా శ్రీమతి K. వెట్రిసెల్వి ని కల్సి శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్,ఏలూరు తాలుకా అధ్యక్షుడు గోన్నూరి శ్రీధర్ రాజు,ఎన్జీజివోస్ అసోసియేషన్ నాయకులు KSR మోహన్, Md. బేగ్, గంగాధర్,రమేష్,పూడి శ్రీనివాస్ మహిళా విభాగం సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గా ఈ సంవత్సర కాలం లో ఉద్యోగుల సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించారని,ఏలూరు జిల్లా ని,ఎమ్మెల్యేలు,ఎంపీ అందరి సహాయ సహకారాలు తో అభివృద్ధి పధంలో కి తీసుకెళుతున్నారని చోడగిరి శ్రీనివాస్ తెలిపారు.
కలెక్టర్ శ్రీమతి K. వెట్రిసిల్వి స్పందిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ జిల్లా యంత్రాంగానికి అందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పపడాలని కోరుతూ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు కు కృతజ్ఞతలు తెలియజేశారు..అనంతరం పేద విద్యార్థులకు 500 నోట్ బుక్స్ ని ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ పక్షాన కలెక్టర్ కి అందజేసారు
246 Less than a minute