కోపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఏలూరు నగరంలో ఉన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సొసైటీ ఉద్యోగస్తులకు వయోపరిమితి 62 సంవత్సరాలు ఉండాలని అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను వెంటనే నిలిపియాలని లేనిపక్షంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వ్యవస్థాపక అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ గతంలో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల వద్ద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించామని అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల వాతావరణం లేకపోవడంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
256 Less than a minute