
NTR విజయవాడ:17-10-25:- గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడంలో సి.పి.ఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) విధానం కీలకమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజయవాడ అధ్యక్షులు డాక్టర్ బి. హనుమయ్య తెలిపారు. ఐఎంఏ ఆధ్వర్యంలో హల్ నందు నిర్వహించిన సి.పి.ఆర్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ హనుమయ్య మాట్లాడుతూ, వైద్య రంగంలోని ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ నేర్చుకోవడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలరని పేర్కొన్నారు. సి.పి.ఆర్ విధానం పై ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా గుండె సంబంధిత ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సమరం, విజయవాడ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్.డి.ఎస్.ఎస్. మూర్తి, కార్యదర్శి పి.ఎం. శర్మ, సహాయ కార్యదర్శి వి. గోకుల్, వైద్యులు విజయశేఖర్, కేశవరావు బాబు, పి. శ్రీనివాస్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
.







