
Hyderabad:29-11-25:-సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్, శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పైప్‌లైన్ రోడ్డులో జరుగుతున్న కొత్త స్టీల్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. నిర్మాణ పురోగతిని పరిశీలించిన కమిషనర్, ఇంజనీరింగ్ విభాగ అధికారులు నుండి పనుల వేగం, నాణ్యత, పూర్తికావాల్సిన దశలపై వివరాలు తెలుసుకున్నారు. బ్రిడ్జి పూర్తయిన తర్వాత ప్రాంతీయంగా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, రవాణా మరింత సులభతరం కానుందని అధికారులు పేర్కొన్నా
తరువాత కమిషనర్ గాజులరామారం, కైసర్‌నగర్ ప్రాంతాలను సందర్శించి, పోలీసు శాఖకు కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ భూమిపై త్వరలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రణాళికలను ఆయన సమీక్షించారు. ఈ సదుపాయం ఏర్పడిన తర్వాత పోలీస్ వాహనాలకు ఇంధన సరఫరా మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. స్థలంలో మౌలిక వసతులు, భూసర్వే వివరాలు, భవిష్యత్ అవసరాలపై కమిషనర్ సంబంధిత విభాగాలతో చర్చించారు.ఈ సందర్శనలో జాయింట్ కమిషనర్ గజ్జరావు గోపాల్, మేడ్చల్ జోన్ డీసీపీ కోటి రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజా భద్రత, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదల, పోలీసు శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా జరిగిన ఈ పరిశీలనలు స్థానికంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.







