పల్నాడుఆంధ్రప్రదేశ్

Daytime robbery in Vinukonda: Burglary at a house near Ram Temple

వినుకొండ పట్టణంలోని విష్ణుకుండినగర్ లోని రద్దీగా ఉండే రామాలయం సమీపంలో పట్టపగలే దొంగతనం జరిగింది.
ఇంటి యజమాని బయటికి వెళ్ళగా, దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి నగదు, బంగారం దోచుకున్నారు.
విష్ణుకుండీ నగర్ లో నివాసం ఉంటున్న గద్దె వెంకట్రావు తన వ్యక్తిగత పనుల మీద బయటికి వెళ్ళారు, అదే సమయంలో ఆయన భార్య బంధువుల ఇంటికి వెళ్లారు.

అదును చూసి దొంగలు ఇంటి ప్రధాన తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న నల్లపూసల గొలుసు, ఒక బంగారపు చైన్, రెండు ఉంగరాలు, మరియు పది వేల రూపాయల నగదును దొంగిలించారు.

వారం రోజుల క్రితం ఇదే బజారులో తెల్లవారుజామున దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన మరువకముందే

పట్టపగలు దొంగతనం జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
పట్టణంలో దొంగల సంచారం పెరిగిందని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా భద్రత లేదని ప్రజలు భయపడుతున్నారు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker