ఆంధ్రప్రదేశ్

AP సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయలు:Decisions taken on various issues at the 27th e-Cabinet meeting held at the Secretariat

.24–07–2025 దీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…

కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబిచే విధంగా నేటి క్యాబినెట్ సమావేశం జరిగింది. సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, అదే ఈ సమావేశంలో ప్రస్పుటమైంది. నిర్థిష్టమైన ఆలోచన, విజన్ తో రాష్ట్ర భవిష్యత్తుకు పటిష్టమైన పునాధులు వేయాలనే లక్ష్యంతో ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ ఒక్క క్యాబినెట్ సమావేశంలోనే దాదాపు రూ.80 వేల కోట్లు పెట్టు బడులకు సంబందించిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది, తద్వారా 1.50 లక్షల మంది ఉద్యోగ అవకాశలు కలుగనున్నాయి. భవిష్యత్తులో పెట్టుబడిదారులు అందరికీ అంతిమ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా విదానాలు తీసుకురావడం, అందుకు అనుగుణంగా వచ్చిన పెట్టుబడులకు ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేయడం జరిగింది.

AP సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయలు:Decisions taken on various issues at the 27th e-Cabinet meeting held at the Secretariat

1.ఐ.టి.ఇ & సి. శాఖ:
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 (2025-30)ఐ.టి.ఇ &సి. శాఖఆమోదం కొరకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ విధానం వ్యాపార వేగాన్ని పెంచడంతో పాటు దేశీయ మరియు ప్రపంచ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ భాగాల పర్యావరణ వ్యవస్థని ఉత్తేజపరచనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టే ఎలక్ట్రానిక్ భాగాల తయారీ కంపెనీలు ముందస్తు ప్రోత్సాహకాలు, మ్యాచింగ్ ప్రోత్సాహకాలు, మధ్యంతర మద్దతు చర్యలు మరియు ప్రత్యేక క్లస్టర్‌లలో ప్లగ్-అండ్-ప్లే తయారీ సౌకర్యాలను పొందవచ్చు. మెగా ప్రాజెక్టులకు అనుకూలంగా ప్రోత్సాహకాలు మరియు రాయితీలను కూడా కంపెనీలు పొందవచ్చు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్, కొప్పర్తి మరియు హిందూపూర్ వంటి ప్రాంతాల్లో గణనీయంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడ నుంది.
2.ఐ.టి.ఇ & సి. శాఖ:
విశాఖపట్నం జిల్లా మధురావాడ, రుషికొండ Non-SEZ జోన్లో IT పార్క్‌లో M/s. ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 0.45 ఎకరాలు భూమిని కేటాయించడానికి మరియు రూ.207.5 కోట్ల పెట్టుబడితో 2500 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్ట్‌కు AP IT & GCC పాలసీ (4.0) 2024-29 కింద ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మంత్రివర్గం SIPB సిఫార్సు మేరకు మ/సె. ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్లాట్ నం. 15B మరియు 15C, హిల్ నం.4లో 4 ఎకరాలు మరియు ప్లాట్ నం.C1A, హిల్ నం.2 (నాన్ SEZ), మధురావాడ, విశాఖపట్నంలో 0.45 ఎకరాలు భూమిని INR 4.05 కోట్లు ప్రతి ఎకరానికి రేటుతో కేటాయించడానికి ఆమోదం తెలిపింది. కంపెనీ భూమి కేటాయింపు తేదీ నుండి 12 నెలల్లో (ఒక క్యాంపస్‌లో) కార్యకలాపాలు ప్రారంభించాలి మరియు రెండు సంవత్సరాలలో 1250 ఉద్యోగాలు మరియు తరువాతి రెండు సంవత్సరాలలో 1250 ఉద్యోగాలు (రెండు క్యాంపస్‌లలో) సృష్టించాలని షరతు విధించబడింది.
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేక్ హోల్డర్స్ మరియు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సూచనలు మరియు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనను సమగ్రంగా సమీక్షించింది.
కంపెనీ తమ ప్రతిపాదిత 4.45 ఎకరాల సదుపాయంతో INR 205 కోట్లు పెట్టుబడి పెట్టి 2500 ఉద్యోగాలను సృష్టించాలని యోచిస్తోంది, ఇది AP IT & GCC పాలసీ 4.0లో పేర్కొన్న కనీస అర్హతతకంటే ఎక్కువ. అదనంగా, ప్రముఖ IT సంస్థలు ప్రతిభను, అనుబంధ పరిశ్రమలను, సేవా ప్రదాతలను మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆకర్షిస్తుంది. ఇది స్థానిక IT పర్యావరణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది మరియు తదుపరి దశలో మరిన్ని పెట్టుబడులకు దారితీసే బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
3.ఐ.టి.ఇ. & సి శాఖ
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిపార్సు మేరకు విశాఖపట్నం జిల్లా మధురవాడ ఐటీ హిల్ నం.3 పై 3.6 ఎకరాల భూమిని ఎకరం రూ.1 కోటి చొప్పున మరియు పరదేసీపాలెం వద్ద 50 ఎకరాలను రూ.50 లక్షల చొప్పున M/s. Sify ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్‌కు APIIC ద్వారా కేటాయించి తద్వారా రూ.16,466 కోట్ల పెట్టుబడులను మరియు 600 ఉద్యోగాలను కల్పించేందుకు ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
ఈ వ్యూహాత్మక అభివృద్ధి విశాఖపట్నంను కీలక డేటా హబ్‌గా స్థాపించి, టెక్నాలజీ ఆధారిత సంస్థలను ఆకర్షించి రాష్ట్ర సామర్థ్యాలను క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవలలో మెరుగుపరుస్తుంది.
4.ఐ.టి.ఇ. & సి శాఖ
విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం గ్రామీణ మండలం మధురవాడ ఐటి హిల్ నెం. 4 పై ప్లాట్ నంబర్లు UDL1, UDL2 మరియు UDL3 వద్ద 30 ఎకరాల భూమిని APIIC ద్వారా ఎకరం INR 1.50 కోట్ల (ఒక కోటి యాభై లక్షలు మాత్రమే) సబ్సిడీ రేటుతో మెస్సర్స్ సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి మరియు SIPB సిఫార్సు చేసిన విధంగా AP IT & GCC పాలసీ (4.0) 2024-25 కింద INR 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను అందించి తద్వారా 25,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
5.ఐ.టి.ఇ. & సి శాఖ
విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం గ్రామీణ మండలం మధురవాడ ఐటి హిల్ నెం. 3 పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమిని మరియు హిల్ నంబర్ 4 పై ప్లాట్ నంబర్ UDL 6 వద్ద 7.79 ఎకరాల భూమిని M/s. ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి మరియు AP ఐటీ & GCC పాలసీ 4.0 (2024 – 29)లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కేటగిరీ కింద ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవడానికి మరియు CCITEI మరియు SIPB సిఫార్సు చేసిన విధంగా INR 1,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను విస్తరించి తద్వారా 10,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
6.ఐ.టి.ఇ. & సి శాఖ
విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం గ్రామీణ మండలం యెండాడ గ్రామంలో (పనోరమా హిల్స్ వెనుక) 30 ఎకరాల భూమిని APIIC ద్వారా ఎకరానికి INR 1.5 కోట్ల చొప్పున M/s. BVM ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి మరియు AP IT & GCC పాలసీ (4.0) 2024-25లో IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కేటగిరీ కింద ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకుని CCITEI మరియు SIPB సిఫార్సు చేసిన విధంగా INR 1250 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
7.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
G.O.Ms.No.10, MA&UD Dept., dt:08.01.2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్లు నియంత్రణ నిబంధనలు, 2020 (LRS-2020)లోని సవరణలను చేసేందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖచేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లికందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను Ac.58.18 ctsవరకు కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌కు విశాఖపట్నం, విజయనగరం&అనకాపల్లి జిల్లాలలో, విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ పథకం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) నిబంధనలు, 2016 ప్రకారం Ac.1941.19 ctsవరకు భూ సేకరణ చేపట్టడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) నిధులతో ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (APUWS&SMIP) కింద ఇప్పటికే ఉన్న 20 ప్యాకేజీల నిర్మాణ పనులు పూర్తి చేయడానికై టెక్నికల్ కమిటీ తన చివరి నివేదికలో చేసిన సిఫార్సులను ఆమోదించడానికి మరియు మిగిలిన పనుల కోసం టెండర్లను ఆహ్వానించడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
G.O.Ms.No.153, MA & UD (CRDA.2) Dept., dt:19.04.2017 r/w G.O.Ms.No.420, dt:31.12.2018లో జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
12.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ:
G.O.Ms.No.76, MA & UD Dept., dt:28.07.2021లోని NTR స్మార్ట్ టౌన్ షిప్స్ లోని/MIG లేఅవుట్లకు సంబంధించి స్టేట్ లెవల్ కమిటీ చేసిన సిఫార్సులలో నిర్దిష్ట మార్పులను ఆమోదించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13.పరిశ్రమలు & వాణిజ్య శాఖ (గనులవిభాగం):
APMDC 2025-26 రెండవ ట్రాంచ్ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా రూ.5,526.18 కోట్ల సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి, 9.3% కూపన్ రేట్‌తో బిడ్స్ చేయడం, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయడం వంటి కీలక కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14.పరిశ్రమలు & వాణిజ్య శాఖ (ఫాక్టరీవిభాగం):
M/s. శ్రీజా మహిళ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి 17.07.2025న జరిగిన SIPB సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
15.పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి M/s. JSW AP స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి 17.07.2025న జరిగిన SIPB సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
16.పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి M/s. గ్రీన్‌లామ్ లిమిటెడ్, M/s. ఆక్సెలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, M/s. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, M/s. రీన్యూ ఫోటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి 17.07.2025న జరిగిన SIPB సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
17.పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి M/s. లారస్ లాబ్స్ లిమిటెడ్ మరియు M/s. ఏస్ ఇంటర్నేషనల్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి 17.07.2025న జరిగిన SIPB సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18.ఇంధన శాఖ:
విజయనగరం జిల్లావంగార మండలం, అరసాడ గ్రామంలో M/s. PVS గ్రూప్ ద్వారా 20TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకై చేసిన అభ్యర్థనకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
19.ఇంధన శాఖ:
PSDF కింద BESS ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి APTRANSCO చైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20.ఇంధన శాఖ:
అంతర్‌రాష్ట్ర సరిహద్దు వివాదాలచే ప్రభావితమైన కురుకుట్టి PSP (1200 MW) మరియు కర్రివలస PSP (1000 MW) కేటాయింపును రద్దు చేయడానికి గుజరాత్‌కు చెందిన M/s. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
21.ఇంధన శాఖ:
నంద్యాల్ జిల్లాలోని అవుకులో M/s. RVR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 800 MW పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ను ఆ సంస్థకు కేటాయించేందుకై చేసిన అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
22.ఇంధన శాఖ:
శ్రీకాకుళం జిల్లా సంతవురిటీ గ్రామం, G.సిగడం మండలంలో M/s. PVS రామ్‌మోహన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 15TPD కంప్రెస్డ్ బయోగ్యాస్(మొత్తం 30 TPD) 2ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకై చేసిన అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
23.ఇంధన శాఖ:
కర్నూల్ మరియు నంద్యాల్ జిల్లాలలోని డోన్ పశ్చిమ ప్రాంతంలో 300 MW విండ్ పవర్ కెపాసిటీలను కేటాయించడం కోసం సవరించిన ప్రభుత్వ ఆదేశాలను సవరించి అనుమతినివ్వాలనిM/s. రీన్యూ వ్యోమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
24.ఇంధన శాఖ:
కర్నూల్ మరియు నంద్యాల్ జిల్లాలలోని డోన్ పశ్చిమ ప్రాంతంలో 600 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపుకు M/s. రీన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
25.ఇంధన శాఖ:
కర్నూల్ జిల్లా గుండు తండ వద్ద గతంలో అనుమతించబడిన M/s. శ్రీజా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కుకేటాయించిన 328 MW విండ్ పవర్ కెపాసిటీని ప్రాజెక్టు అమలులో ఆలస్యం కారణంగా అనుమతి రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
26.ఇంధన శాఖ:
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)ను APPDCL లో కొత్త షేర్‌హోల్డర్‌గా చేసి, 2044-2045 వరకు అప్పుల కాలపరిమితిలో రూ.1724 కోట్ల మొత్తానికి APPDCL తరపున పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (PFC)కు రివాల్వింగ్ ప్రభుత్వ గ్యారెంటీని అందించడానికి APPDCL మేనేజ్‌మెంట్‌లో మార్పులు/పునర్నిర్మాణానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
27.ఇంధన శాఖ:
అనంతపురం జిల్లాలో M/s. ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో M/s. ఆరోబిందో రియాల్టీ&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించిన 800 MW సింగనమల PSP కెపాసిటీ ప్రాజెక్ట్ రద్దుకై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
28.ఇంధన శాఖ:
YSR కాదప జిల్లా జమ్మలమాడుగు మండలంలోని శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం బదులుగా సున్నపురల్లపల్లె మరియు ఇతర గ్రామాలలో 1050 MW కెపాసిటీలో 400 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు M/s. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ప్రభుత్వంచే మంజూరు చేయబడిన 1050 MWసోలార్ పవర్ ప్రాజెక్ట్ లో నుండి 400 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ఏర్పాటును YSR కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం బదులుగా సున్నపురాళ్ళపల్లె మరియు ఇతర గ్రామాలలో ఏర్పాటు చేసేందుకైM/s. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
29.ఇంధన శాఖ:
అమరావతిలో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ డిక్లరేషన్ కై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
30.జల వనరుల శాఖ:
విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలంలో M/s. మాక్స్ ఇన్‌ఫ్రా (I) లిమిటెడ్‌కు Agt No. 12 SE / 2006-07 Dt. 9-3-2007 ద్వారా అప్పగించిన “తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌లో కాలువ వ్యవస్థ మెరుగుదల మరియు ఆధునీకరణ” పనుల కాంట్రాక్ట్ ముందస్తు ముగింపుకై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
31.జల వనరుల శాఖ:
YSR కడప జిల్లాలో 2023-24 సంవత్సరంలో రూ.291.00 లక్షలకు “గండికోట లిఫ్ట్ ఇర్రిగేషన్ స్కీమ్ స్టేజ్-I మరియు స్టేజ్-II పంప్ హౌసెస్” పని కోసం AME అంచనాకు (i) పరిపాలనా ఆమోదం మరియు (ii) SSR 2022-23తో రూ.291.00 లక్షలకు నామినేషన్ ఆధారంగా M/s. మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు పని అప్పగించేందుకై చేసిన ధృవీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
32.జల వనరుల శాఖ:
నంద్యాల్ జిల్లా, పాణ్యం మండలం, గోరకల్లు గ్రామంలోని గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కింద “శ్రీ నరసింహరాయ సాగర్ ప్రాజెక్ట్ (గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) రక్షణ పనులు” ఫేజ్-I కోసం రూ.53.00 కోట్లకు పరిపాలనా ఆమోదానికై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
33.వ్యవసాయ & సహకార శాఖ:
HDBRG పొగాకు సేకరణ, రైతు షెడ్యూలింగ్, పరిమాణ పరిమితులు, కేంద్ర విస్తరణ మరియు లాజిస్టిక్స్ కు సంబంధించిన సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
a. ప్రతి రైతుకు 20 క్వింటల్స్ పరిమితిగా నిర్ణయించడం.
b. 14.07.2025 నుండి 1 క్వింటల్ నుండి 20 క్వింటల్స్ వరకు ఉన్న రైతులను అత్యల్పం నుండి అత్యధికం క్రమంలో షెడ్యూల్ చేయడం, ప్రస్తుతం అనుసరిస్తున్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతికి బదులుగా చేస్తుంది.
c. 12-07-2025 వరకు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన వారిని కొనసాగిస్తుంది.
d. 20 క్వింటల్స్ కంటే ఎక్కువ ఉన్న రైతులను కూడా 20 క్వింటల్స్‌కు పరిమితం చేసే విధంగా షెడ్యూల్ చేయడం.
e. DLPC నిర్ణయం ప్రకారం మరిన్ని సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తుంది.
f. ప్రస్తుత సేకరణ కేంద్రాల సామర్థ్యానికి మించిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి APSWC స్టోరేజీ స్థాయిని పెంచనుంది. తద్వారా కొనుగోలు కేంద్రాల్లో అంతరాయం లేకుండా సేకరణ నిర్వహించిస్తుంది.
g. ఈ ఉత్పత్తుల రవాణా ఖర్చును ఉత్పాదిత వ్యయానికి జోడింఛి రైతులను భారం కలగకుండా చూస్తుంది.
34.వ్యవసాయ & సహకార శాఖ:
బానగనపల్లెలో మార్కెట్ యార్డుకు దక్షిణంగా కోయిలకుంట్ల రోడ్డుకు వద్ద ఉన్నBC బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ నిర్మాణం కొరకు యాజమాన్య హక్కులను బదిలీ చేయకుండా మరియు అద్దె ఆధారం లేకుండా Acres 5.97 cents వరకు భూమి కేటాయింపుకువ్యవసాయ &సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
35.రెవెన్యూ శాఖ:
అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లాలోని కెంద్రీయ విద్యాలయ సంఘటన్ , సికందరాబాద్ వారికి పర్మనెంట్ స్కూల్ భవనం, స్టాఫ్ క్వార్టర్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రూ.1,75,00,000/- చెల్లింపుపై Sy.No.511-2 ఆఫ్ సుందరయ్యపేట, H/o సీతానగరం గ్రామంలోని Ac.10.00 cents వరకు ప్రభుత్వ భూమి అప్పగింపుకై రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
36.రెవెన్యూ శాఖ:
G.O.Ms.No.119, Revenue (Lands-VI) Dept., dated 15.03.2024లో మైదుకూర్ బదులుగా N.మైదుకూర్ అని గ్రామ పేరును సవరించి పేర్కొనడంలో జరిగిన లోపానికి ఎర్రాటా జారీ చేయడానికి మరియు NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనుకూలంగా రూ.21,08,000/- భూమి విలువ చెల్లింపుపై జనరల్ వేర్‌హౌస్ నిర్మాణం కోసం మైదుకూర్ మండలంలోని మైదుకూర్ గ్రామంలో Ac.5.08 cents మొత్తం కొలతలో ప్రభుత్వ భూమి అప్పగింపు ఆమోదానికై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
37.రెవెన్యూ శాఖ:
2024-25 నాటికి వాటర్ ట్యాక్స్ బకాయిలపై రూ.85.81 కోట్ల అసాధారణ వడ్డీ మొత్తాన్ని రైతుల నుండి వాటర్ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసేటప్పుడు ఒక్కసారిగా మాఫీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
38.సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్)
తిరుపతిలోని బైరాగిపట్టేడలోగల పద్మావతి పార్క్ వద్ద 08.01.2025 తేదీన జరిగిన తొక్కిసలాట సంఘటనపై విచారణ కొరకు నియమించబడిన ఆంధ్రప్రదేశ్గౌరవ. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఏకసభ్య కమీషన్ సమర్పించిన విచారణ నివేదకకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
39.న్యాయ శాఖ (గృహ, కోర్టులు.ఎ)
న్యాయూర్తులకు మరియు ఇతర ప్రముఖులు సెలవు సమయంలో ప్రోటోకాల్ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇప్పటివరకు అవుట్ సోర్స్సింగ్ విధానంలో ఉన్న 7 డ్రైవర్(1 సీనియర్ డ్రైవర్ + 6 డ్రైవర్లు) పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
40.యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
విశాఖపట్నంలో 5 నక్షత్రాల లగ్జరీ హోటల్ అభివృద్ధి కోసం కోల్‌కతాలోని M/s ఐటీసీ హోటల్స్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలను అందించడానికి తే.17.07.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
41.యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
విశాఖపట్నంలోని AMTZ వద్ద 5-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని M/s లాన్సమ్ లీజర్స్ &ఎంటర్‌టైన్‌మెంట్ LLP వారికి ప్రోత్సాహకాలను అందించడానికి తే.17.07.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

  1. యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
    తిరుపతిలో 5 నక్షత్రాల హోటల్ అభివృద్ధి కోసం బెంగళూరులోని మెస్సర్స్ స్టార్టర్న్ హోటల్స్ LLP వారికి ప్రోత్సాహకాలను అందించడానికి తే.17.07.2025 దీన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
  2. పాఠశాల విద్య శాఖ
    2025-26 విద్యా సంవత్సరం నుండి “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయడానికిపాఠశాల విద్యా శాఖ G.O.Ms.No.26, 12.06.2025తేదీనజారీ చేసిన మార్గదర్శకాలకు అలాగే G.O.Ms.No.27 12.06.2025తేదీన పరిపాలనా అనుమతులకు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
  3. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
    ఇప్పటివరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఎపి నూర్ బాషా/దూదేకుల సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ స్థానంలో కొత్తగా “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల ఆర్థిక సంస్థ”ను నెలకొల్పుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖచేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది
  4. పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ
    విశాఖపట్నం నగరంలోరూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో 50-50 జాయింట్ వెంచర్ ప్రాతిపదికన చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు సంబంధించి 40% వ్యయానికి సంబంధించిన పనులకు టెండర్లను ఆహ్వానించడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
  5. పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ
    విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్-I క్రింద రెండు కారిడార్లతో అనుమతి మంజూరు ప్రతిపాదన, రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో, 50:50 ప్రభుత్వ జాయింట్ వెంచర్ (JV) ఈక్విటీ ఫండింగ్ మోడల్ ప్రకారం, ప్రాజెక్టు ఖర్చులో 40% వరకు టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు సూత్రప్రాయ అంగీకారం మరియు Ministry Of Housing and Urban Affairsఅనుమతికి లోబడి Notice to Proceed (NTP) జారీ చేయడంపై పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
  6. రెవెన్యూ శాఖ:
    శ్రీ సత్య సాయి జిల్లా మడకసిర మండలం R.అనంతపురము గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి APIIC సంస్థకు వివిధ సర్వ్ no.లలో ఎకరా439.27సెంట్లభూమిని ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

స్టేటస్నోట్:
యువజనాభివృద్ది, పర్యాటకమరియుసాంస్కృతికశాఖ:
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వన్యప్రాణులు, సాహసం, వారసత్వం, పర్యావరణ మరియు టెంపుల్ టూరిజం సర్క్యూట్‌లను స్థాపించడం మరియు ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker