రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు.
ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం. పర్యటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముంది. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు.
3,239 Less than a minute