
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం:
దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుండి దాచేపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందుగా వెళ్తున్న లారీకి వెనుక నుంచి ఢీకొంది.
ప్రకటనల ప్రకారం, లారీ డ్రైవర్ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్, ఒక మహిళకు తీవ్ర గాయాలు, అలాగే కండక్టర్‌తో సహా మరో పదిమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని 108 అంబులెన్స్ సాయంతో దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొంత మందిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







