
దుగ్గిరాల: మండల కేంద్రమైన దుగ్గిరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన శివ గోపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, తొలుత అర్చకులు రామనాథం వేదమంత్రోచ్చారణల మధ్య అతిథులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.
అనంతరం నేతలు రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, మహిళా విభాగ అధ్యక్షురాలు ఫిలోమి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, గంపల గంగాధర్, కొప్పుల శ్రీనివాసరావు, షేక్ సుభాని, మల్లవరపు నాగరాజు, కొండూరు సుమన్, షేక్ జానీ భాష, పిల్లి ధర్మరత్నం, మత్తే ఆనంద్, నూతక్కి కోటేశ్వరరావు, రాము, ఇత్తడి రమేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.http://GUNTUR NEWS







