
సికింద్రాబాద్:17-10-25:- దీపావళి పండుగ వేళ చిన్నారుల కళ్ల భద్రతపై అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ వాసన్ కంటి ఆస్పత్రి ప్రత్యేక చర్యలు చేపట్టింది. టపాసులు పేల్చే సమయంలో కళ్లలో నిప్పురవ్వలు పడి గాయపడే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత కంటి చికిత్స అందించేందుకు ఆస్పత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.

ఈనెల 15 నుండి 24 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందని ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఆశిష్ తెలిపారు. గత ఏడాది దీపావళి సందర్భంగా చిన్నారుల్లో కంటి గాయాల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కళ్లకు ఇబ్బందులు తలెత్తిన వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని డాక్టర్ ఆశిష్ సూచించారు. వాసన్ కంటి ఆస్పత్రి మొదటిసారిగా ఇలాంటి ఉచిత సేవను అందిస్తున్నట్లు తెలిపారు.







