
Bapatla:parchur:- రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ప్రజల జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగి సంతోషాల వెలుగులు ప్రసరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని తెలిపారు. ఈ దీపావళి విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.“టపాసుల వెలుగులతో, దీపాల కాంతులతో ప్రతి ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజల కష్టాలను దీపాల జ్యోతులు తరిమేయాలని కోరుకుంటున్నాను,” అని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు
.దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, ఒక్కొక్క దీపం వెలిగించడం లాగే ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ బంగారు భవిష్యత్తు వైపు సాగుదామని పిలుపునిచ్చారు.అష్టలక్ష్ములు ప్రతి ఇంటలో నెలవై సకల శుభాలు, ధైర్యం, స్థైర్యం, విజయాలు, సిరిసంపదలు ప్రసాదించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, తెలుగింటి లోగిళ్లన్నీ దీప కాంతులతో ప్రకాశించాలని కోరుకున్నారు.
 
  
 






