VITAP NEWS: డీప్‌టెక్‌లో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి విఐటి-ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐఐటి మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం
Vit AP
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు పరిశోధన సహకారాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా విఐటి-ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐఐటి మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటి మద్రాస్ మరియు విఐటి- ఏపి విశ్వవిద్యాలయం మధ్య విస్తృత ఒప్పందంగా గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ డీన్ ప్రొ. రఘునాథన్ రంగస్వామితో మొదటి ఒప్పందం మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT మద్రాస్) నేతృత్వంలోని ప్రతిష్టాత్మక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (ISEA) ప్రాజెక్ట్ కింద విఐటి- ఏపి విశ్వవిద్యాలయాన్ని స్పోక్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తిస్తూ రెండవ అవగాహన ఒప్పందం పై విఐటి- ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. ఎస్.వి. కోటా రెడ్డి మరియూ IITM నుండి ICSR డీన్ డాక్టర్ మను సంతానం సంతకం చేశారు. ఈ అవగాహన ఒప్పందాల వల్ల విఐటి-ఎపి కీర్తి మరింత పెరుగుతుందని… దీని ద్వారా ఇరు సంస్థల మధ్య జ్ఞాన మార్పిడికి అవకాశం ఉంటుందని విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా. జగదీష్ చంద్ర ముదిగంటి అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఐఐటి- మద్రాస్ కు చెందిన ప్రముఖులు, మరియు విఐటి-ఎపి విశ్వవిద్యాలయానికి చెందిన డా. అమిత్ చవాన్, డా. సుధాకర్ ఇలంగో, డా. శిబి చక్రవర్తి పాల్గొన్నారు