గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ మేరకు నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కమిషనర్ గోరంట్ల, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్, నగరాలులోని పలు ప్రాంతాలను పరిశీలించి, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పిన్ పాయింట్ మేరకు క్లస్టర్ల మేరకు పారిశుధ్య పనులు జరగాలని, శానిటేషన్ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో నూరు శాతం పారిశుధ్య పనులు జరిగేలా భాధ్యత వహించాలన్నారు. ఉదయం ఇంటింటి చెత్త సేకరణ అనంతరం మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా డ్రైన్లలో పూడికతీత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల పక్కన డెబ్రిస్ లేకుండా అవసరమైతే ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
143 Less than a minute