Distribution of notebooks and sheets to students
పేద విద్యార్థులకు విద్యాపరంగా సాయమందించే లక్ష్యంతో నడిచే సదావర్తి అన్నదాన సత్రం (నుదురుపాడు) ట్రస్ట్ మరోసారి ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం నుదురుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీలు గుర్రం నాగేశ్వరరావు, గుర్రం ఉషారాణి ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన 40 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యా అవసరమైన నోట్‌బుక్స్, పలకలు పెన్సిళ్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ
చదువు ద్వారా పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారొచ్చు. అందుకే విద్యార్థులకు అవసరమైన సాహిత్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం”అని చెప్పారు.
గుర్రం నాగేశ్వరరావు మాట్లాడుతూ:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కొన్నిసార్లు చిన్నచిన్న అవసరాలు కూడా విద్యపై దృష్టి మళ్లించేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో, నోట్స్, పెన్సిల్స్ వంటి సామాన్యమైన వాటిని అందించడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.