వచ్చే జూన్ నెలాఖరు నాటికి టిడ్కో గృహాలను అప్పగించేలా పనులు -మంత్రి నిమ్మల రామానాయుడు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…గత టిడిపి ప్రభుత్వం హయాంలో 90 శాతం మేర పూర్తయిన టిడ్కో గృహాలను, మిగిలిన 10 శాతం పనులకు సంబంధించి రూపాయి ఖర్చు, అరబస్త సిమెంటు పని కూడా గత వైసిపి ప్రభుత్వంలో నోచుకోలేదని, టిడిపి నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుందని అన్నారు. అంతే గాక పేదల ఇళ్లను 5వేల కోట్లకు తాకట్టు పెట్టి నిధులను దారి మళ్ళించిందని మంత్రి రామానాయుడు అన్నారు.