
బాపట్ల, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ లో జరుగుతుందని ఆయన తెలియ జేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాల యాల్లో మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలు అర్జీలను ఇవ్వవచ్చు నని ఆయన తెలియ జేశారు. అర్జీదారులు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసు కోవచ్చని ఆయన తెలియజేశారు. ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని ఆయన తెలియ జేశారు. అలాగే వారి అర్జీలు నమోదు చేసిన అర్జీల యొక్క స్థితికి సంబంధించి సమాచారం తెలుసు కోవడానికి1100 నేరుగా కాల్ చేయవచ్చునని ఆయన తెలియజేశారు. (జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాల యం నుండి విడుదల చేయడమైనది







