

28వ తారీఖున దివ్యాంగులకు క్రీడా పోటీలు.
బాపట్ల జిల్లా: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 28వ తారీఖున దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుచున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 3 న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ మేరకు ఈనెల 28 వ తేదీన ఉదయం 9 గంటలకు బాపట్ల జిల్లా మినీ స్టేడియం నందు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించుచున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు 12 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయసు గల బాల బాలికలు అర్హులన్నారు. సబ్ జూనియర్ సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. అథ్లెటిక్స్ లో అన్ని వయసుల వారు అర్హులు అన్నారు. షార్ట్ పుట్,100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, వీల్ చైర్ షార్ట్పుట్, చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు.







