
బాపట్ల అక్టోబర్ 22:- |ఇనకొల్లు పోలీస్ రావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభ అవార్డుకి ఎంపికైనట్లు ఎస్.పి.ఎల్.టి.ఓ. అధికారులు తెలిపారు.ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న జరుపుకునే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని ఈ అవార్డులు ప్రధానం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ — “చింతయపాలెం, కర్లపాలెం పాఠశాలల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను, కరుణ జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2011 నుంచి కొనసాగుతున్న ‘చేయూతనిద్దాం – చైతన్య పరుద్దాం’ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.ఈ అవార్డును ఈ నెల 26న గుంటూరులో ఘనంగా ప్రధానం చేయనున్నారు.ఇదిలా ఉండగా, ఇనకొల్లు పోలీస్ రావు ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అవార్డు, ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డు వంటి అనేక పురస్కారాలను పొందారు.

ఈ తాజా అవార్డు ప్రకటనపై కర్లపాలెం మండల అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షుడు పఠాన్, అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు ఎం. పరమానంద కుమార్, డి. ధనుంజయ్, అలాగే రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తిమ్మరాజు సుబ్బారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.సమాజ సేవా రంగంలో అంకితభావం, విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ జాతీయ స్థాయి అవార్డు మరో గౌరవ ముద్ర వేసిందని పలువురు అభినందనలు తెలిపారు.







