chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా రత్న అవార్డుకు దోవా రమేష్ రాంజీ ఎంపిక

గుంటూరు:-గత రెండు దశాబ్దాలుగా దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న న్యాయవాది దోవా రమేష్ రాంజీకి ప్రతిష్ఠాత్మక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా రత్న అవార్డు లభించింది.

ఆదివారం గుంటూరులో నిర్వహించిన మాలల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదగా ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.

పాత రేపల్లె తాలూకా ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా రేపల్లె డివిజన్ దళిత అంబేద్కర్ యువజన సమాఖ్య అధ్యక్షులుగా, అలాగే మాల మహాసభ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందిన రమేష్ రాంజీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.Guntur Local News

రాష్ట్ర వ్యాప్తంగా జాతి ఔన్నత్యం, దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వ్యక్తులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా రమేష్ రాంజీ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దోవా రమేష్ రాంజీ మాట్లాడుతూ,
“అంబేద్కర్ పేరు మీద అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఇది సమాజ హితం పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. జీవితాంతం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.

ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు న్యాయవాదులు, దళిత సంఘాల ప్రతినిధులు, మాల సంఘ నాయకులు రమేష్ రాంజీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker