
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, గంజాయి నిర్మూలన అంశాలను ప్రధాన ప్రాధాన్యంగా తీసుకోవాలని, చట్టాలను అమలు చేయడంలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే పోలీస్ అధికారులకు సూచించారు.







