chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

విశాఖ బీచ్ లో డబుల్ డెక్కర్ బస్సులు

  • హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, ఆగస్టు 29: విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కొంత దూరం ప్రయాణించారు. బస్సు నుంచే బీచ్ లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. పర్యాటకులకు కొత్త అనుభవం కలిగేలా ఈ బస్సులో ప్రయాణం ఉంటుందని సీఎం అన్నారు. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటల పాటు ఒకే టికెట్‌తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ రూ.500గా నిర్ణయించగా, అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. కేవలం రూ.250కే 24 గంటల పాటు హాప్ ఆన్ – హాప్ ఆఫ్ బస్సులో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పౌరులు, పర్యాటకులు పర్యావరణ హితంగా ప్రవర్తించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు. మరోవైపు గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా, వారి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ భారత్‌కే టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందని అన్నారు.

మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ

మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker