వంతెన నిర్మించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కు వినతిపత్రం సమర్పించిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని మాచవరం నుండి బెహరా వారి పాలెం మధ్యలో గల వంతెన కృంగిపోయి చిన్నపాటి వర్షాలకు సైతం వాన నీటి ప్రవాహంతో విప్పర్ల రెడ్డిపాలెం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదేవిధంగా మోడల్ స్కూల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు ఆయా పాఠశాలలకు వర్షాలు పడితే వంతెనపై నీటి ప్రవాహం విపరీతంగా ఉండటం వలన వంతెన దాటి వెళ్ళలేకపోతున్నారని అదేవిధంగా చేజర్ల,కొత్తపల్లి, కుంకలగుంట, విప్పర్ల రెడ్డిపాలెం, మర్రిచెట్టుపాలెం, బెహరావారిపాలెం నుండి మాచవరం, నల్లగార్లపాడు, రావిపాడు మీదుగా నరసరావుపేటకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని మండల కేంద్రమైన రొంపిచర్ల కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని తక్షణమే వంతెన నిర్మాణానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తగిన నిధులు మంజూరు చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదారమేష్ కుమార్ ఈరోజు నరసరావుపేటలోని నరసరావుపేట పార్లమెంటు కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వంతెన సమస్యపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో చర్చించారు. అనంతరం రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచవరం బెహరావారిపాలెం మధ్య గల వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారని తెలిపారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రాగానే వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని రమేష్ కుమార్ అన్నారు.