గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు గురువారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 383 మంది హాజరయ్యారు. వారిలో 77 మందికి సంబంధిత ధ్రువ పత్రాలు లేకపోవడంతో వెనుతిరిగారు. మిగిలిన 306 మంది అభ్యర్థులకు శరీర కొలత పరీక్షలు (ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ) నిర్వహించగా వారిలో 23 మంది చాతి మరియు ఎత్తు కొలతలు సరిపోకపోవడం వల్ల తిరస్కరించారు. మిగిలిన 283 మందికి 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించగా 41 మంది అనర్హులు కాగా 242 మంది తదుపరి పరీక్షల కొరకు అర్హత సాధించారు. అదేవిధంగా 242 మందికి 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించగా వారిలో 147 మంది అర్హత సాధించారు.242 మందికి లాంగ్ జంప్ నిర్వహించగా వారిలో 236 మంది అర్హత సాధించారు. మొత్తం 306 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా వారిలో 238 మంది అర్హత సాధించగా, 68 మంది అనర్హత సాధించడం జరిగింది. కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణ తీరును ప్రతి ఘట్టంలో స్వయంగా పరిశీలించి, పరీక్షల నిర్వహణ అధికారులకు మరియు అభ్యర్థులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పలు సూచనలు చేశారు.
138 1 minute read