

చీరాలలో ఘనంగా డా. మద్దులూరి మహేంద్రనాధ్ జన్మదిన వేడుకలు
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడించాలి: డా. మద్దులూరి మహేంద్రనాధ్ పిలుపు
భారీ ర్యాలీతో అభిమానుల సందడి
చీరాల: రానున్న మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సత్తా చాటి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండాను రెపరెపలాడించాలని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాధ్ పిలుపునిచ్చారు.
సోమవారం, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తనయుడు, నియోజకవర్గ టీడీపీ అధికారప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాధ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లతో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.టీడీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ డిమార్డ్,నల్లగాంధీ బొమ్మ సెంటర్ మీదుగా, ముంతవారి సెంటర్, మున్సిపల్ ఆఫీస్, బస్టాండ్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సాగిన ర్యాలీలో దారి పొడవునా అభిమానులు మహేంద్రనాధ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. స్థానిక గడియారస్తంభం సెంటర్లో అభిమానులు గజమాలతో మహేంద్రనాధ్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం, అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో మహేంద్రనాధ్ పుట్టినరోజు కేకు ను కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచాలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.
పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మహేంద్రనాథ్ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తనపై అభిమానంతో ఘనంగా పుట్టినరోజు సంబరాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని అన్నారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మళ్ళీ మళ్ళీ జరిగే ఎన్నికల్లో చీరాలలో టీడీపీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కూటమి నాయకులు, కార్యకర్త కృషి చేయాలని ఆయన తెలిపారు.








