chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో ఎన్‌టీఆర్ జిల్లాలో 510 కి.మీ సైకిల్ ర్యాలీ

విజయవాడ, జనవరి 27:– డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ నినాదంతో 35 రోజులపాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రను మంగళవారం ప్రారంభించారు.

Vijayawada Local News :డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో ఎన్‌టీఆర్ జిల్లాలో 510 కి.మీ సైకిల్ ర్యాలీ

ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి రాష్ట్ర హోంశాఖ మంత్రి వి.అనిత, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు.

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్, జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐఏఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ ఐపీఎస్, ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Vijayawada Local News :డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో ఎన్‌టీఆర్ జిల్లాలో 510 కి.మీ సైకిల్ ర్యాలీ

ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వి.అనిత మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డ్రగ్స్ వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మహిళా పోలీసుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారాయని, ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

Vijayawada Local News :డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో ఎన్‌టీఆర్ జిల్లాలో 510 కి.మీ సైకిల్ ర్యాలీ

ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యమాత్మక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం అవసరమన్నారు.

ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తల్లిదండ్రుల జీవితాలు విషాదంగా మారుతున్నాయని, దేశ భద్రతకూ ఇవి ముప్పుగా మారుతున్నాయన్నారు.

Vijayawada Local News :డ్రగ్స్‌పై దండయాత్ర నినాదంతో ఎన్‌టీఆర్ జిల్లాలో 510 కి.మీ సైకిల్ ర్యాలీ

జిల్లా కలెక్టర్ లక్ష్మి శా మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, యువతను రక్షించేందుకే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.Vijayawada Localnews


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker