chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Drunk and drive pai:డ్రంక్ అండ్ డ్రైవ్‌పై విజయవాడ పోలీసుల కఠిన చర్యలు

విజయవాడ: 04-11-25:-రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్‌.టి‌.ఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి‌. రాజశేఖర బాబు ఐపీఎస్‌ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో నవంబర్‌ 4న 2వ, 4వ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 51 కేసులు నమోదు చేసి, మద్యం సేవించి వాహనాలు నడిపిన చోదకులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని ఆరవ అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి శ్రీ జి. లెనిన్‌ బాబు గారు విచారణ అనంతరం తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా 6 మందికి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున రూ.90,000, మిగిలిన 45 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.4,50,000 జరిమానా విధించి, మొత్తం రూ.5.40 లక్షలు విధించడం జరిగింది.ట్రాఫిక్‌ పోలీసులు ప్రతిరోజూ ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్‌ నియమాలు, మోటార్‌ వాహన చట్టాలను కచ్చితంగా పాటించి, సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి‌. రాజశేఖర బాబు ఐపీఎస్‌ సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker