వినాయక చవితి సందర్భంగా ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మండప నిర్వహకుల దేనని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు అన్నారు . సత్తెనపల్లిలో dsp కార్యాలయంలో సోమవారం వినాయక మండప నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో డిఎస్పీ మాట్లాడుతూ
గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మండపాలకు సంబంధించిన పూర్తి అనుమతులు యాప్ లో ఎలా నమోదు చేయాలో వివరించారు . సత్తెనపల్లి పరిధిలోని అన్ని మండపాల వద్ద పోలీసుల నిఘ ఉంటుందని తెలిపారు కావున ఎలాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో ci నాగమల్లేశ్వరావు , si పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
2,314 Less than a minute