
ముంబై:02-11-25:-ముంబైలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే ఐసీసీ చైర్మన్ జై్ షా కుటుంబ సభ్యులను కూడా కలిశారు.
ఈ సందర్భంగా లోకేష్ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,“ఇది నా జీవితంలో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్” అని పేర్కొన్నారు.సచిన్ టెండూల్కర్ వినయం, మానవత్వం గురించి విన్న ప్రతి మాట నిజమని, వాటిని స్వయంగా చూసి ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు.







