
ఏలూరు :- కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ముప్పై మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన పార్టీని ప్రజలు రోజు రోజుకు మరింతగా ఆదరిస్తున్నారని అన్నారు. నాడు ప్రజల పక్షాన పోరాటం చేసిన జనసేన అధినేత, నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల విశ్వాసంతోనే అనేక మంది ఇతర పార్టీలను వీడి జనసేనలో చేరుతున్నారని తెలిపారు.Eluru Local News: శివనాగేంద్ర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టి 10వ మహోత్సవం ఘనంగా
పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటాలు ప్రజల్లో విస్తృత ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, సామాన్య ప్రజలు జనసేనను భవిష్యత్తుకు ఆశాజనకమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారని అన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్రానికి సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమని నమ్మకంతో జనసేనలో చేరామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.







