Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

ఏలూరు జిల్లా కలెక్టర్ k వెట్రి సెల్వి గారిని ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కలసి పలు అంశాలపై చర్చించారు

ఏలూరు:19 09 25:- జిల్లా కలెక్టర్ k వెట్రి సెల్వి గారిని ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కలసి పలు అంశాలపై చర్చించారుఈ రోజు నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన సమస్యలు విశ్లేషించినప్పుడు, ఎక్కువ భాగం సమస్యలు జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయం, గ్రామీణ జల సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ (SE RWS), అలాగే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) పరిధిలో ఉన్నాయని గుర్తించామని వివరించారు. ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిపాలన ఎల్లప్పుడూ చురుకుగా స్పందిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు.అలాగే జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి (ఏలూరు GGH)లో రోగులు మరియు వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెయిటింగ్ హాల్స్ నిర్మాణంకు సంబంధించి చర్చ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి సహకారంతో త్వరలోనే ఈ నిర్మాణాలు చేపట్టి రోగులకు మరింత సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు.అదేవిధంగా గత కొన్ని నెలలుగా జీతభత్యాలు అందక ఇబ్బందులు పడుతున్న సత్య సాయి త్రాగునీటి పథకం సిబ్బందికి రూ. 2.00 కోట్లు ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసినట్లు చైర్ పర్సన్ తెలిపారు. దీంతో సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాల సమస్య పరిష్కారం జరిగింది అని ఛైర్పర్సన్ వారు తెలిపారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button