
ఏలూరు: 12-11-25;-జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు, ఆర్&బీ, ట్రాన్స్‌పోర్ట్ శాఖలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ చర్యల్లో భాగంగా ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ గారి సూచనలతో గుండు గొలను నుండి ద్వారకా తిరుమల (లక్ష్మీనగర్) వరకు తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంయుక్త తనిఖీ బృందం పరిశీలన చేపట్టింది.
భీమడోలు సీఐ శ్రీ యు.జె. విల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబు, చేబ్రోలు ఎస్ఐ సూర్య భగవాన్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ద్వారకా విటల్, ఆర్&బీ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మీరావాలి, డీటీఆర్‌బీ (DTRB) సిబ్బంది పాల్గొన్నారు.అధికారులు రహదారి పరిస్థితులను పరిశీలించి ప్రమాదాలకు దారితీసే బలహీన ప్రాంతాలను గుర్తించారు. ప్రమాదాలు జరగకుండా రోడ్డు పక్కన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వంకలు, మలుపుల వద్ద రోడ్ మార్కింగ్‌లు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజల సహకారంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.







