
ఏలూరులోని జిఎంసి బాలయోగి సైన్స్ పార్క్ మార్గం.మొత్తం ఎనిమిది హాస్టళ్లు, సోషల్ వెల్ఫేర్ జిల్లా కార్యాలయం,రెండు విద్యుత్ కార్యాలయాలు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ క్రింద చూస్తున్న బురద నీటి మార్గం గుండా రోజు 2000 మంది హాస్టల్ పిల్లలు ఉదయం,సాయంత్రం ఇందులో నుండే నడుచుకుంటూ వెళ్లిపోవాలి. సోషల్ వెల్ఫేర్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజానీకం, విద్యుత్ కార్యాలయాలకు వచ్చి వెళ్లే ప్రజానీకం, అధికారులు, సిబ్బంది అంతా ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్ళాలి. రోడ్డు అంతా గోతులమయం. బురద నీటిమయం. పిల్లలు సాక్స్, షూ వేసుకుంటే మొత్తం తడిచిపోతాయి. హాస్టల్ పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. పట్టించుకున్న నాథుడు లేడు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ప్రభుత్వానికి,అధికారులకు చీమకుట్టినట్టు లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సముదాయాలకు వెళ్ళే మార్గంలో ఉన్న ఈ రోడ్డును తక్షణమే బాగు చేయాలి. హాస్టల్ విద్యార్థులకు, ప్రజానీకానికి గోతులు, బురదమయం లేని రోడ్డు ఏర్పాటు చేయాలి.
 
  
 






