
ఏలూరు, జనవరి 07:– ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశాల నిమిత్తం శనివారం ఏలూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం లభించింది.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు.
అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఘంట పద్మశ్రీ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీ సంక్షేమ అభివృద్ధి చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.Eluru Local news
ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










