
ఏలూరు: అక్టోబర్ 14:-ఏలూరు: అక్టోబర్ 14:ఏలూరు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గొలుసు లాకింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి మొత్తం 80 గ్రాముల బంగారం, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాల్లోకి వెళితే…సెప్టెంబర్ 23న సాయంత్రం 4:45 గంటల సమయంలో బాపిరాజుగూడెం నుండి ధర్మాజీగూడెం వైపు వెళ్తున్న రోడ్డులో ఒడ్డుకట్ట చెరువు సమీపంలో ఈ దొంగతన ఘటన చోటుచేసుకుంది. లింగపాలెం గ్రామానికి చెందిన బొల్ల నాగలక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి ఇంటికి వస్తుండగా, ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు నాన్తాడు మరియు నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, నిందితుల కదలికలను గమనించి అక్టోబర్ 13న వారిని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన నిందితులు:చవల భార్గవ కృష్ణ (20)భరగడ హర్షవర్ధన్ (23)కాకర్లపర్తి గణేష్ (18)బద్ది హేమ అచ్యుత్ (23)కోలా అప్పలరాజు (22)
వీరంతా ఏలూరు పట్టణానికి చెందిన వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండేవారుగా గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ఆస్తులు:మొత్తం 80 గ్రాముల బంగారంధర్మాజీగూడెం కేసు: 20 గ్రాముల నాన్తాడు, 6 గ్రాముల నల్లపూసల గొలుసుభీమడోలు కేసు: 16 గ్రాముల గొలుసుఅగిరిపల్లి కేసు: 8 గ్రాముల గొలుసుఏలూరు III టౌన్ కేసు: 28 గ్రాముల బంగారు సూత్రాలునిందితులు వాడిన నాలుగు బైకులు: Honda Access, Honda Activa, Royal Enfield, Bajaj Pulsarఈ దర్యాప్తులో జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఉ. రవి చందర్ నేతృత్వంలో, చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. క్రాంతి కుమార్, ఎస్సై కె. వెంకన్న తదితరులు చురుకుగా పనిచేశారు. పోలీస్ సిబ్బంది కె. వెంకటేశ్వరరావు, వి. సీతదేవయ్య, పి. హనుమంతరావు, పి. సత్యనారాయణ, వి.టి. విష్ణుకుమార్, బి. సతీష్ లు ఇందులో భాగస్వాములయ్యారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌కు పలువురు స్థానికులు ప్రశంసలు తెలియజేశారు.
 
  
 






