ఏలూరు నగరంలోని సత్రంపాడు కెనరా బ్యాంక్ దగ్గర నూతనంగా ఎన్ ఎస్ జి డేన్స్ అకాడమీ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు smr పెదబాబు, పలువురు కార్పొరేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ గిరి మాస్టర్ మాట్లాడుతూ ఈవెంట్స్, ఇంటికి వచ్చి డాన్స్ నేర్పించడం, పాఠశాలలకు వెళ్లి డాన్స్ నేర్పించడం, సంగీత్ లు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ప్రత్యేకంగా వెస్ట్రన్, సెమి క్లాసికల్, మాస్, లిరికల్ డాన్స్, జుంబా, సల్సా, సినిమా డాన్సులు ప్రత్యేకంగా నేర్పించి 60 రోజుల్లోనే మార్పు తీసుకొస్తామని తెలిపారు. ఏలూరు నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పిల్లల భవిష్యత్తుకు అదనంగా డాన్స్ నేర్పించడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని తెలిపారు.
230 Less than a minute