SUBHASH CHANDRABOSE.:భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు….
SUBHASH CHANDRABOSE.:భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు....
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్యదర్శులు..
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో సియం ముఖ్య కార్యదర్శి యం.రవిచంద్ర,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,సియం కార్యదర్శులు ఎవి.రాజమౌళి,ప్రద్యుమ్న సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.మాతృభూమి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి ఆనాటి అత్యున్నత సర్వీసైన ఐసిఎస్ ను తృణప్రాయంగా త్యజించిన ఘనుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అని వారు ఈసందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
ఆనాడు భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ అని వారు పేర్కొన్నారు.ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాష్ చంద్ర బోస్ పోరాడి విదేశాల్లోని భారతీయుల సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా వీరోచిత పోరాటం చేసిన గొప్ప యోధుడు సుభాష్ చంద్ర బోస్ అని వారు కొనియాడారు.