
జి. కొత్తపల్లి,ద్వారకా తిరుమల,ఏలూరు జిల్లా:
ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో సామాన్యుడికి చోటు క్రమంగా కనుమరుగవుతోందని, ప్రజా సమస్యలకంటే వ్యక్తిగత దూషణలు, కుల రాజకీయాలే ప్రధానంగా మారాయని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పేదవాడు, అణగారిన వర్గాల నుంచి వచ్చిన యువకుడు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే అణచివేత, బెదిరింపులు, దాడులు తప్పవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Eluru Local News :చింతలపూడి-జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – డీఈఓ వెంకట లక్ష్మమ్మ
ఇలాంటి రాజకీయ వాతావరణంలో సామాన్య యువతకు ఒక కొత్త ఆశగా విజయ్ దళపతి ఎదుగుతున్నారని ఏలూరు జిల్లా యువ నాయకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాలను ప్రజల నుంచి దూరం చేసిన వ్యవస్థకు ప్రత్యామ్నాయం అవసరమని, ఆ ప్రత్యామ్నాయంగా విజయ్ దళపతి నాయకత్వం కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు ఏలూరు జిల్లా యువ నాయకుడు పెండెం సురేష్ ఒక తీవ్ర ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, విజయ్ దళపతి స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఆశయాలు కేవలం తమిళనాటికే పరిమితం కావని, దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలకు రాజకీయ ఆశను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు, కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా TVK నిలబడటం వల్లే యువత ఆకర్షితులవుతోందని అన్నారు.
“ప్రజల కోసం కాదు… పదవుల కోసం రాజకీయాలు చేస్తున్న నాయకత్వాన్ని యువత తిరస్కరిస్తోంది. కులం, డబ్బు, బలప్రయోగం కాకుండా ప్రజల పక్షాన నిలిచే నాయకత్వం రావాలి. ఆ మార్పుకు నాంది పలికే శక్తి విజయ్ దళపతి వద్ద ఉంది” అని పెండెం సురేష్ స్పష్టం చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువత, అభిమానులు విజయ్ దళపతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలే కేంద్రంగా ఉండే రాజకీయ వ్యవస్థ ఏర్పడాలంటే కొత్త దారులు తెరుచుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో TVK పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, విజయ్ దళపతి అభిమానిగా గుర్తింపు పొందిన పసుపులేటి సందీప్‌ను కలిసి, తమిళనాట జరగనున్న ఎన్నికల్లో క్రియాశీలకంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ మార్పుకు తొలి అడుగుగా అభివర్ణించారు.
“సామాన్యుడికి అధికారం దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయ్ దళపతి అడుగులు పడే వరకు మా పోరాటం ఆగదు” అని పెండెం సురేష్ స్పష్టమైన పిలుపునిచ్చారు.
ప్రకటన విడుదల చేసిన వారు:
పెండెం సురేష్
విజయ్ దళపతి అభిమాన సంఘం నాయకుడు
జి. కొత్తపల్లి గ్రామం, ద్వారకాతిరుమల మండలం
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 8897904389











