
పోలవరం (ఏలూరు జిల్లా): జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలవరం మండలం, పాత పట్టిసం గ్రామానికి చెందిన జల్లిగంపల శాంత (32) అనే మహిళా కూలి పాముకాటుకు గురై మృతి చెందింది. స్థానిక వివరాల ప్రకారం, శాంత మండలంలోని గుంజవరం గ్రామంలో ఉన్న మొక్కజొన్న తోటలో కూలి పనికి వెళ్లింది.

అక్కడ పని చేస్తున్న సమయంలో ఆమె పాము కాటుకు గురైంది. గమనించిన తోటి కూలీలు మరియు స్థానికులు వెంటనే ఆమెను పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే శాంత పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పాత పట్టిసం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.http://ELURU NEWS







