ఏడు నెలల పరిపాలనలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రూ.లక్ష 19 వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతుందని చెప్పారు. ఇంటింటికీ గ్యాస్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు.
134 Less than a minute